చరణ్ తో సినిమాపై స్పందించిన మణిరత్నం

Saturday,April 01,2017 - 02:02 by Z_CLU

ప్రస్తుతం చెలియా సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు దర్శకుడు మణిరత్నం. ఈ సినిమా విడుదలైన తర్వాత నెక్ట్స్ ఆయన చేయబోయే సినిమా రామ్ చరణ్ తోనే. ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో బోలెడంత చర్చ జరుగుతోంది. మణిరత్నం ఎప్పుడు కనిపిస్తాడా డీటెయిల్స్ కనుక్కుందామని చాలామంది వెయిటింగ్. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది.

చెలియా ప్రమోషన్ లో భాగంగా చెర్రీ సినిమాపై రియాక్ట్ అయ్యాడు మణిరత్నం. అయితే రామ్ చరణ్ తో చేయబోయే సినిమాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి రామ్ చరణ్ తో సినిమా కోసం ఇంకా ఎలాంటి కాన్సెప్ట్ లాక్ చేయలేదంటున్నారు ఈ దర్శకుడు. కొన్ని ఫ్రెష్ కాన్సెప్ట్స్ తో త్వరలోనే రామ్ చరణ్ తో చర్చలు జరిపి స్టోరీ లైన్ ఫిక్స్ చేస్తానని ప్రకటించారు.

ప్రస్తుతం సుకుమార్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు రామ్ చరణ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే మణిరత్నంతో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు చెర్రీ. సో… స్టోరీ డెవలప్ చేయడానికి మణిరత్నంకు చాలా టైం ఉంది.