మణిరత్నం నవాబ్ ఎవరు..?

Monday,September 10,2018 - 07:31 by Z_CLU

ఈ నెల 27 న రిలీజవుతుంది మణిరత్నం నవాబ్. రీసెంట్ గా రిలీజైన   ట్రైలర్ ఈ సినిమాని సోషల్ మీడియాలో వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యేలా చేసింది. దానికి తోడు ఈ సినిమాలోని ముగ్గురన్నాదమ్ముల్లో ‘నవాబ్’ ఎవరనిపించుకుంటారా..? అనే క్యూరియాసిటీని కూడా రేజ్ చేసింది.

క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ముగ్గురన్నాదమ్ముల మధ్య రిలేషన్ షిప్ ఈ సినిమాలో మెయిన్ ప్లాట్. భారీ కాన్వాస్ పై మణిరత్నం మార్క్ ఇమోషనల్ సీన్స్ తో పాటు, భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా, టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

అరవింద స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేష్, శింబు, విజయ్ సేతుపతి, త్యాగరాజన్ తదితరులు నటిస్తున్న ఏ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఈ సినిమాకి A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజర్.