మణిరత్నం కొత్త సినిమా ఫస్ట్ లుక్

Friday,February 09,2018 - 06:06 by Z_CLU

చెలియా లాంటి ఇంటెన్సివ్ లవ్ ఎంటర్ టైనర్ తరవాత భారీ స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించనున్నాడు మణిరత్నం. చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో డిస్కర్షన్ లో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజయింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి తెలుగులో ‘నవాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేసింది సినిమా యూనిట్.

 అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో జ్యోతిక, అదితి రావ్ హైదరి ఫీమేల్ లీడ్స్ గా కనిపించనున్నారు. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమా మద్రాస్ టాకీస్ తో పాటు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతుంది. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజర్.