మణిరత్నం - మోహన్ బాబు కాంబోలో సినిమా రాబోతుందా ?

Sunday,March 03,2019 - 11:06 by Z_CLU

అవును మణిరత్నం -మోహన్ బాబు కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.. డైరెక్షన్ లో మాస్టర్ అనిపించుకున్న టాప్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవలను ఆధారంగా తీసుకొని ఓ హిస్టారికల్  సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

తమిళ్ , తెలుగు, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే విక్రం , విజయ్ , శింబులతో పాటు బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్ , ఐశ్వర్య రాయ్ లను కూడా సంప్రదించారట. అయితే   ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం లేటెస్ట్ గా మోహన్ బాబుని కూడా కలిసాడు మణిరత్నం.

ఇటివలే ‘మహానటి ‘లో ఎస్.వి.రంగారావు క్యారెక్టర్ లో కనిపించిన మోహన్ బాబు మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో మణి రత్నం చెప్పిన కథతో పాటు క్యారెక్టర్ కూడా నచ్చడంతో మోహన్ బాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్స్ తో డిస్కర్షణ్ జరుపుతున్న మణిరత్నం ఓ కొలిక్కి రాగానే సినిమా టైటిల్ తో పాటు నటీ నటుల పేర్లు కూడా ప్రకటించనున్నారని సమాచారం.