గ్రాండియర్ విజువల్స్ తో 'మణికర్ణిక' ట్రైలర్

Friday,January 04,2019 - 02:08 by Z_CLU

రాణి లక్ష్మీ బాయ్ కథ అందరికీ తెలిసిందే. ఈ రోజు రిలీజైన  ట్రైలర్ లో కూడా ఆ కథనే కన్వే చేశారు మేకర్స్. కాకపోతే ఈ ట్రైలర్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ గ్రాండియర్ విజువల్స్, కంగనా రనౌత్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్. సెట్స్ పైకి రాకముందే ఈ సినిమా కోసం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంది కంగనా రనౌత్. ఆ పర్ఫెక్షన్ ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.    

ఝాన్సీ రాణి లక్ష్మీ బాయ్ బాల్యం నుండే బిగిన్ అయ్యే సినిమా, ఆమె పెళ్ళి, ఆ తరవాత బ్రిటీషు వారి నుండి ఝాన్సీ ని కాపాడుకునే ప్రయత్నంలో రాణి లక్ష్మీబాయ్ పడ్డ స్ట్రగుల్ కళ్ళకు కట్టినట్టు ప్రెజెంట్ చేయనున్నారు మేకర్స్. ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది స్పెషల్ మూవీగా నిలవనుంది మణికర్ణిక, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.

సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఈ సినిమాకి ఆడియెన్స్ లో ఏ  రేంజ్ డిమాండ్  క్రియేట్  అయి ఉందో  క్లియర్ గా తెలుస్తుంది.  శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. జీ స్టూడియోస్, కమాల్ జైన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. జనవరి 25 న గ్రాండ్ గా రిలీజవుతుంది మణికర్ణిక.