మణిరత్నం ‘నవాబ్’ నుడి సెకండ్ ట్రైలర్

Saturday,September 22,2018 - 10:06 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘నవాబ్’ ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. మణిరత్నం సినిమా అనగానే క్రియేట్ అయిన వైబ్స్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది ఈ సినిమా. ఆ తరవాత వరసగా రిలీజైన ఈ సాంగ్స్, సినిమాపై మరింత పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు అదే జోష్ లో ఈ నెల 22 న ఈ సినిమా నుండి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిలిమ్ మేకర్స్.

తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న మేకర్స్, ఈ నెల 25 న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్నారు. ఈ ఈవెంట్ లో సినిమాకు సంబంధించి మరిన్ని ఎగ్జైటింగ్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

రెగ్యులర్ స్టోరీస్ కి భిన్నంగా మోస్ట్ ఇంటెన్సివ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పెరుగుతున్న అంచానాలు చూస్తుంటే, సినిమా సక్సెస్ గ్యారంటీ అనే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. A.R. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. అరవింద స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేష్, శింబు, విజయ్ సేతుపతి, త్యాగరాజన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.