మంగళంపల్లి బాలమురళీకృష్ణ అస్తమయం

Tuesday,November 22,2016 - 07:03 by Z_CLU

శాస్త్రీయ సంగీత కోవిదుడు, కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కన్నుమూశారు. కంపోజర్, నటుడు, ప్లేబాక్ సింగర్ గా రాణించిన బాలమురళీకృష్ణ… భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారు. దేశంలో రెండో అత్యున్నత పురష్కారమైన పద్మవిభూషణ్ తో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నారు. తెలుగులో బాలమురళీ కృష్ణ ముద్ర చెక్కుచెదరనిది.

నర్తనశాల సినిమాలోని ఈ పాటను బాలమురళీకృష్ణ ఆలపించారు. అత్యంత మధురమైన పాటల్లో ఇప్పటికీ ఈ పాటది ప్రత్యేక స్థానం.

గుప్పెడు మనసు చిత్రంలోని ఈ పాట వింటే మనసు తేలికవుతుంది. సుమధురమైన ఈ పాటను ఆలపించింది బాలమురళీకృష్ణగారే. దర్శకుడు బాలచందర్, సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ అభ్యర్థన మేరకు మంగళంపల్లి ఈ గీతం ఆలపించారు.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మేఘసందేశం సినిమాలో మంగళంపల్లి ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. సినిమాలో ఓ సందర్భంలో వచ్చే పాటలో ఈ స్వరకర్త కనిపించడమే కాకుండా.. ఆ పాటను స్వయంగా ఆయనే ఆలపించారు. పాడనా వాణి కల్యాణిగా అనే ఈ పాట తెలుగు ఎవర్ గ్రీన్ సాంగ్స్ లో ఒకటి.

 

బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాలో శ్రీరామ జయరామ అనే ఈ పాటకు ప్రాణం పోశారు మంగళంపల్లి. టైటిల్స్ సందర్భంగా వచ్చే ఈ పాట, ఇప్పటికీ అనేక దేవాలయాల్లో  వినిపిస్తూనే ఉంటుంది.

hqdefault

ఈ సినిమాలతో పాటు అందాలరాముడులో పలుకే బంగారమాయెరా పాట, ఎన్టీఆర్ నటించిన జయభేరి సినిమాలో శుక్లాం భరదరం అనే స్తోత్రాన్ని మంగళంపల్లి ఆలపించారు. ఇక భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడిగా కూడా కనిపించి మెప్పించారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ.