పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ సెలబ్స్

Thursday,November 23,2017 - 12:04 by Z_CLU

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య ఈ రోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. నాగ్, అఖిల్, సమంత, అమలతో పాటు టాలీవుడ్ ప్రముఖులంతా నాగచైతన్యకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

మంచు విష్ణు కూడా ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ హీరో, ఆ మూవీని ఓ కొలిక్కి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీతో పాటు మంచు విష్ణు నటిస్తున్న ఓటర్ సినిమా ఫస్ట్ లుక్ ను అతడి బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖుల్లో అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. వరుస విజయాలతో హ్యాట్రిక్ డైరక్టర్ అనిపించున్నాడు అనిల్ రావిపూడి. రాజా ది గ్రేట్, సుప్రీమ్, పటాస్ సినిమాలతో హిట్స్ కొట్టిన ఈ హీరో.. ప్రస్తుతం వెంకీతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికి ఎఫ్-2 అనే టైటిల్ అనుకుంటున్నారు.

మరో దర్శకుడు శ్రీవాస్ కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బాలకృష్ణతో డిక్టేటర్, గోపీచంద్ తో లౌక్యం, రామ్ తో రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలు తీసిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం బెల్లంకొండ హీరోగా సాక్ష్యం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ ప్రముఖులందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.