ఏప్రిల్ 6 న ఆచారి అమెరికా యాత్ర

Monday,March 26,2018 - 03:43 by Z_CLU

మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయింది. గతంలో జనవరి 26 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రిపబ్లిక్ డే బాక్సాఫీస్ రేస్ నుండి సడెన్ గా తప్పుకుంది. ఇప్పుడు ఏప్రిల్ 6 న  రిలీజవుతున్న ఈ సినిమా U.S. లో ఒకరోజు ముందుగా ఏప్రిల్ 5 న   రిలీజవుతుంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.  మ్యాగ్జిమం  అమెరికాలోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో తెరకెక్కిన ఈ సినిమా, సమ్మర్ కి పర్ఫెక్ట్ ట్రీట్ అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమాకి G. నాగేశ్వర్ రెడ్డి డైరెక్టర్.

బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో కామెడీ హైలెట్ కానుంది. మంచు విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి, తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన  కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.