'అహం బ్రహ్మస్మి' అంటున్న మంచు మనోజ్

Thursday,February 13,2020 - 12:02 by Z_CLU

‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఎట్టకేలకు నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసాడు. శ్రీకాంత్ రెడ్డి అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ‘అహం బ్రహ్మస్మి’ టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు మనోజ్. ఈ సినిమాతో నిర్మాతగా మారబోతున్నాడు. ఇటివలే ఎం.ఎం.ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించిన మనోజ అదే బ్యానర్ మీద నిర్మల దేవితో కలిసి ‘అహం బ్రహ్మస్మి’ సినిమాను నిర్మిస్తున్నాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందనుంది. తెలుగు, హిందీ , తమిళ్. కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చ్ 6న గ్రాండ్ గా లాంచ్ కానుంది. అదే రోజు సినిమాకు సంబంధించి నటీ నటులు , సాంకేతిక నిపుణుల  పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.