మంచు మనోజ్ మరింత కొత్తగా...

Saturday,May 13,2017 - 11:30 by Z_CLU

హీరో మంచు మనోజ్ ఈసారి తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గుంటూరోడు సినిమాతో హల్ చల్ చేసిన ఈ హీరో త్వరలోనే “ఒక్కడు మిగిలాడు” సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు మంచువారబ్బాయ్.

ఒక్కడు మిగిలాడు సినిమాలో మంచు మనోజ్ డ్యూయల్ రోల్ చేశాడు. కెరీర్ లో ఫస్ట్ టైం ద్విపాత్రాభినయం చేశానని ప్రకటించిన మనోజ్… ఒక్కడు మిగిలాడు సినిమాలో ఎల్టీటీఈ టైగర్ గా, స్టూడెంట్ లీడర్ గా రెండు రకాల పాత్రల్లో కనిపించబోతున్నానని ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలకాగా, తాజాగా మరో స్టిల్ రిలీజ్ చేశారు. త్వరలోనే టీజర్ లాంఛ్ చేయబోతున్నారు.