హాట్ టాపిక్: ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా ఆ హీరో

Monday,July 06,2020 - 01:26 by Z_CLU

ఓ స్టార్ హీరో సినిమాలో మరో హీరో విలన్ గా చేస్తే…? అది హాట్ టాపిక్ అవ్వడం ఖాయం. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. ఎన్టీఆర్ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 30 సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇటివలే అనౌన్స్ చేసిన ఈ సినిమా ‘RRR’ షూట్ పూర్తవ్వగానే మొదలుకానుంది.

అయితే ఇందులో ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ కోసం మేకర్స్ మనోజ్ ని సంప్రదించారని, తారక్ సినిమా కావడంతో మంచు హీరో వెంటనే ఓకే అన్నాడని అంటున్నారు.

ఈ ప్రచారంలో నిజమెంత అనేది పక్కన పెడితే తారక్-మనోజ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ హీరో-విలన్ పాత్రల్లో నటిస్తే కచ్చితంగా అది హాట్ టాపిక్కే.