షాకింగ్.. మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై

Wednesday,June 14,2017 - 10:51 by Z_CLU

షాకింగ్ న్యూస్.. మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. ఎలాగోలా, ఏదో ఒక క్యారెక్టర్ తో వెండితెరపై వెలిగిపోదామని అంతా ప్రయత్నించే ఈ రోజుల్లో… ఫుల్ బ్యాక్ గ్రౌండ్ పెట్టుకొని మరీ మంచు మనోజ్ సినిమాలకు టాటా చెప్పేశాడు. ఈ మేరకు అఫీషియల్ గా ట్వీట్ చేశాడు మంచువారబ్బాయ్

ప్రస్తుతం ఈ హీరో ఒక్కడు మిగిలాడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా సెట్స్ పై ఉంది. ఇవే నటుడిగా తన ఆఖరి సినిమాలని ప్రకటించేశాడు మంచు మనోజ్. ఒక్కడు మిగిలాడు సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు మంచు మనోజ్. ఒక జనరేషన్ లో స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా, మరో షేడ్ లో ఎల్టీటీఇ అధినేత ప్రభాకరన్ గా కనిపించనున్నాడు.

నటుడిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసిన మంచు మనోజ్.. నిర్మాతగా కొనసాగే అవకాశాలున్నాయి. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ వీళ్లదే. ఇదే కాకుండా.. మంచు విష్ణుకు కూడా ఓ బ్యానర్ ఉంది. ఈ రెండు బ్యానర్ లపై సినిమాలు నిర్మించే అవకాశం ఉంది. లేకపోతే దర్శకుడిగా కూడా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, ఈ నటుడికి పరిశ్రమలో అన్ని విభాగాలపై పట్టుంది.