మంచు లక్ష్మీ ప్రసన్న ఇంటర్వ్యూ

Wednesday,July 18,2018 - 06:04 by Z_CLU

మంచు లక్ష్మీ ప్రసన్న లీడ్ రోల్ ప్లే చేసిన ఇమోషనల్ థ్రిల్లర్ W/O రామ్. విజయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తన భర్తను చంపిన హంతకుడు ఎలాగైనా శిక్షించబడాలని ఫైట్ చేసే అమ్మాయిలా కనిపించనున్నారు లక్ష్మీ ప్రసన్న. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కి  సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. దానికి తోడు లక్ష్మీ ప్రసన్న ఈ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అవి మీకోసం…

ఈ సినిమా వేరు…

మన ఇండస్ట్రీలో చాలా రేర్ గా జోనర్ బేస్డ్ సినిమాలు వస్తుంటాయి. W/O రామ్ కూడా అలాంటిదే. ఇది అందరు చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో అన్ని సినిమాల్లాగా సాంగ్స్, ఫైట్స్ ఉండవు. కంప్లీట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్.

అందుకే ఓకె చెప్పా…

విజయ్ స్టోరీ చెప్పినప్పుడు జస్ట్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నేను రెగ్యులర్ గా వినే స్టోరీస్ వేరు.. ఈ స్టోరీ వేరు.

అందుకే ఎట్రాక్ట్ అయ్యా….

సినిమాలో ఇలా టైటిల్స్ పడతాయో లేదో స్టోరీ ఫాస్ట్ గా మూవ్ అవుతూనే ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు  మీరు ఊపిరి తీసుకోవడం కూడా మార్చిపోతారు. అంతలా మెస్మరైజ్ అయిపోతారు. అందుకే ఈ స్టోరీకి నేనంతలా ఎట్రాక్ట్ అయ్యాను.

 

ఆ సినిమా వేరు…

అందరూ ఈ సినిమా ట్రైలర్ చూశాక ఇది ‘కహానీ’ సినిమా అనుకుంటున్నారు. కానీ అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు సంబంధం లేదు. మహా అయితే ఆ సినిమాలో విద్యా బాలన్ రోల్ వైఫ్, ఈ సినిమాలో నేను కూడా వైఫ్ కాబట్టి సినిమా పేజ్ అలా అనిపించి ఉంటుంది.. ఇది కంప్లీట్ గా డిఫెరెంట్ సినిమా…

అదీ స్టోరీ…

సినిమాలో నా పేరు దీక్ష. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో పిన్ని, బాబాయిల దగ్గర పెరుగుతుంది. ఆ తరవాత రామ్ తో పెళ్లవ్వడం.. అంతా పర్ఫెక్ట్ జరిగిపోతున్నప్పుడు సడెన్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆమె లైఫ్ నే మార్చేస్తుంది… ఆ సిచ్యువేషన్స్ లో దీక్ష ఏం చేస్తుంది..? ఎవరి సపోర్ట్ దొరకని పరిస్థితుల్లో ఒంటరిగా జస్టిస్ కోసం ఎలా ఫైట్ చేస్తుంది అనేదే ఈ సినిమా స్టోరీలైన్.

నాకు విజయ్ లో నచ్చిందదే…

విజయ్ స్టోరీని నమ్ముకునే ఫిల్మ్ మేకర్. అసలు సినిమాకి బడ్జెట్ తో సంబంధం లేదంటాడు.  అదే నాకు తనలో చాలా నచ్చింది. ఆఫ్ కోర్స్ బిగ్ స్కేల్ సినిమాలు కూడా రావాలి కానీ, వాటికే పరిమితం అయిపోకూడదు.

అది మ్యాజికల్ ఎనర్జీ…

నా సినిమా ఎప్పుడు రిలీజైనా జనం మధ్యలో కూర్చుని సినిమా చూడటానికి ఇష్టపడతాను. సినిమా ఆడుతుందా లేదా అనేది అక్కడ వచ్చే రియాక్షన్స్ తో తెలిసిపోతుంది.

 

అద్భుతమైన కాస్టింగ్…

సామ్రాట్… రామ్ రోల్ ప్లే చేశాడు ఈ సినిమాలో.  చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తాడు. ఇక ప్రియదర్శి విషయానికి వస్తే ఈ సినిమాలో కమెడియన్ లా కాకుండా స్ట్రేట్ ఫార్వార్డ్ పోలీసాఫీసర్ లా కనిపిస్తాడు. ఆదర్శ్ తో పాటు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు.

అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు…

ఈ సినిమాలో దీక్ష పడే కష్టం మామూలుది కాదు. ఒక్కోసారి మనం పడే మనోవేదన ముందు మన శరీరానికి తగిలిన గాయం కూడా చాలా చిన్నదైపోతుంది.. అలాంటి పరిస్థితుల్లో ఉండే ఒక విమెన్ స్టోరీ ఇది… దీక్ష లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఒకవేళ వస్తే అసలు అధైర్యపడకూడదు.

తమిళ సినిమా…

రాధా మోహన్ గారి డైరెక్షన్ లో ‘తుమ్హారీ సులు’ తమిళ రీమేక్ లో చేస్తున్నాను. ఇంకా మలయాళం, బెంగాళీ అన్ని భాషల్లోను నటించాలని ఉంది. అప్పుడే మన గురించి మనకు ఇంకా తెలుస్తుంది.