`మనమంతా` సెన్సార్ పూర్తి ఆగస్టు 5 న విడుదల

Tuesday,July 19,2016 - 01:02 by Z_CLU

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం `మనమంతా`. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ ను పొందింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా ఆగ‌స్టు 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. సీనియ‌ర న‌టి గౌత‌మి స‌హా  గౌతమి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు. మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నలుగురు వ్యక్తుల ప్రయాణమే మ‌న‌మంతా.  క‌చ్చితంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.