మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాను

Wednesday,July 15,2020 - 12:13 by Z_CLU

గతేడాది పెళ్లి చేసుకుంది హీరోయిన్ మనాలీ రాథోడ్. కనీసం రెండేళ్లు గ్యాప్ తీసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ మనాలీ మాత్రం పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. ఆల్రెడీ ఓటీటీ కంటెంట్ లోకి ఎంటరైన ఈ బ్యూటీ.. త్వరలోనే సినిమాల్లోకి వస్తానని చెబుతోంది.

“నేను నటించిన ఒక తమిళ్ సినిమా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో విడుదలకు సిద్దంగా ఉంది. తెలుగులో కొందరు దర్శకులు అప్రోచ్ అయ్యారు. త్వరలో వాటి వివరాలు చెబుతాను. పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న రోల్స్ చెయ్యడానికి సిద్దంగా ఉన్నాను. త్రివిక్రమ్, రాజమౌళి, క్రిష్ దర్శకుల దగ్గర వర్క్ చెయ్యాలని ఉంది.ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ వున్నారు, అందరూ టచ్ లో ఉన్నారు.”

గతేడాది బీజేపీ యూత్ లీడర్ విజిత్ ను పెళ్లాడింది మనాలీ రాథోడ్. తమది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అంటున్న మనాలీ.. ప్రస్తుతం లైఫ్ చాలా బాగుందని, సినిమాల్లో కూడా క్లిక్ అయితే మరింత హ్యాపీ అంటోంది.