‘యాత్ర’ టీజర్ రివ్యూ

Friday,December 21,2018 - 12:46 by Z_CLU

దివంగత మాజీ ముఖ్యమంత్రి Y.S. రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది ‘యాత్ర’ మూవీ. మళయాళ సూపర్ స్టార్ ‘మమ్ముట్టి’ ఈ సినిమాలో YSR గా కనిపించనున్నాడు. ఫిబ్రవరి 8 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ని ఈ రోజు రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా టైటిల్ ని రివీల్ ని చేసినప్పుడే YSR రాజకీయ జీవితంలో కీ ఎలిమెంట్ గా నిలిచిన పాదయాత్ర ఈ బయోపిక్ లో ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవుతుందని గెస్ చేశారు ఆడియెన్స్. ఈ టీజర్ ని బట్టి ఎక్స్ పెక్ట్ చేసినట్టుగా పాదయాత్ర అంశాలతో పాటు, అప్పట్లో రైతు సమస్యలు, YSR వారికి ఆసరాగా నిలుచున్న అంశాలు హైలెట్ అవుతాయని తెలుస్తుంది.

మమ్ముట్టి, YSR గా పర్ఫెక్ట్ చాయిస్. పంచెకట్టులో పొలిటికల్  లీడర్ గా   YSR ని గుర్తు చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో.  మరీ ముఖ్యంగా ‘నేను  విన్నాను… నేను ఉన్నాను’ అనే డైలాగ్  సినిమాకి  ఇమోషనల్  గా కనెక్ట్ అయ్యేలా  చేస్తుంది.

మహి.వి.రాఘవ్ ఈ సినిమాకి డైరెక్టర్. విజయ్ చిల్లా, శశిధర్ రెడ్డి 70 MM ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘యాత్ర’ కి K. మ్యూజిక్ కంపోజర్.