'మామ ఓ చందమామ' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

Sunday,December 10,2017 - 10:15 by Z_CLU

రామ్‌ కార్తీక్‌ హీరోగా సనా మక్బూల్‌ఖాన్‌ హీరోయిన్‌గా ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై విశాఖ థ్రిల్లర్‌ వెంకట్‌ దర్శకత్వంలో వరప్రసాద్‌ బొడ్డు నిర్మించిన ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మామ ఓ చందమామ’. ఈ సినిా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హీరో రాజశేఖర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటూ.. యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పాడు.

మున్నా కాశి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సక్సెస్‌ అయి, సోషల్‌ మీడియాలో పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రీ రిలీజ్‌ కార్యక్రమానికి రాజశేఖర్ తోపాటు ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరవగా సీనియర్‌ హీరో సుమన్‌, జీవిత, రాజ్‌ కందుకూరి, హీరో రామ్‌ కార్తీక్‌, హీరోయిన్‌ ససనా మక్బూల్‌ఖాన్‌, దర్శకుడు విశాఖ థ్రిల్లర్‌ వెంకట్‌, సంగీత దర్శకుడు మున్నా కాశీ, సీనియర్‌ నటి గీతాంజలి, ప్రముఖ దర్శకుడు శేఖర్‌ సూరి, అయోధ్యకుమార్‌, సంగీత దర్శకుడు శశిప్రీతమ్‌, నాగం తిరుపతిరెడ్డి, చందూలాల్‌, శ్రీనివాస్‌ బొడ్డు తదితరులు హాజరయ్యారు.

ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదలైంది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్‌ 15న రిలీజ్‌ కానుంది.