మామ ఫార్ములా..

Wednesday,September 21,2016 - 03:55 by Z_CLU

అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ‘ప్రేమమ్’. చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియో ఘనంగా విడుదలైంది. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా విషయంలో చైతు తన మావయ్య ఫార్ములా ను ఫాలో కాబోతున్నాడు. ఈ ఫార్ములా తోనే కెరీర్ లో మరో గ్రాండ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

     నాగ చైతన్య ఫాలో అవుతున్న ఆ మావయ్య ఎవరో కాదు. విక్టరీ వెంకటేష్. టాలీవుడ్ లో రీమేక్ రాజా గా పేరుతెచ్చుకున్న వెంకీ ఇటీవలే ‘దృశ్యం’, ‘గోపాల-గోపాల’ వంటి రీమేక్ చిత్రాలతో గ్రాండ్ హిట్స్ అందుకున్నాడు. తాజాగా ‘సాలా ఖదూస్’ అనే సినిమాను ‘గురు’ పేరు తో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు చైతు కూడా ఇలా రీమేక్ ఫార్ములానే నమ్ముకున్నాడు. ‘తడాఖా’ తో కెరీర్ లో తొలి రీమేక్ కు శ్రీకారం చుట్టి విజయం అందుకున్న ఈ అక్కినేని యువ హీరో తాజాగా ‘ప్రేమమ్’ రీమేక్ తో కూడా మావయ్య బాటలో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి మామయ్య ఫార్ములా చైతూకి ఎలా కలిసొస్తుందో? చూడాలి.