సితార బ్యానర్ పై నాని హీరోగా సినిమా?

Thursday,June 14,2018 - 07:10 by Z_CLU

హిట్ కొట్టిన కొత్త దర్శకులెవర్నీ వదలడం లేదు సితార బ్యానర్. మొన్నటికిమొన్న ఛలో సినిమాతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుములకు అడ్వాన్స్ అందించింది. ఇప్పుడీ లిస్ట్ లోకి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా చేరాడు. సుమంత్ హీరోగా ‘మళ్లీ రావా’ అనే సినిమాను తీసిన ఈ దర్శకుడు.. తన రెండో ప్రాజెక్టును సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తీయబోతున్నాడు. ఈ విషయాన్ని రేపు అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.

ఈ సినిమాకు ‘పల్లెకు పోదాం పారును చూద్దాం’ అనే డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు. ఈ మేరకు టైటిల్ కూడా రిజిస్టర్ అయిపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అదే టైటిల్ ను రేపు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో నాని హీరోగా నటించే ఛాన్స్ ఉందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

కృష్ణార్జున యుద్ధం  తర్వాత ఇప్పటివరకు కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ చేయలేదు నాని. గౌతమ్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాని సినిమా చేసే అవకాశం ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. దీనిపై రేపు పూర్తి క్లారిటీ రానుంది.

ప్రస్తుతం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగచైతన్య-మారుతి కాంబినేషన్ లో శైలజారెడ్డి అల్లుడు సినిమా తెరకెక్కుతోంది. దీంతో పాటు సుధీర్ వర్మ-శర్వానంద్ కాంబోలో మరో సినిమా నిర్మాణంలో ఉంది. ఈ రెండింటిలో ఒకటి కొలిక్కివచ్చిన వెంటనే గౌతమ్ తిన్ననూరి సినిమా స్టార్ట్ అవుతుంది.