స్టడీగా సాగిపోతున్న మజిలీ

Friday,April 19,2019 - 06:03 by Z_CLU

మజిలీ సినిమా విడుదలైన నిన్నటికి సరిగ్గా 2 వారాలు. 10 రోజులు దాటితే థియేటర్లలో సినిమా నిలవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మజిలీ సినిమా ఏకంగా 2 వారాల రన్ పూర్తిచేసుకుంది. అంతేకాదు, మరో 2 వారాలు కూడా నిలబడేంత స్టామినా సంపాదించుకుంది. నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విడుదలైన ఈ 14 రోజుల్లో వరల్డ్ వైడ్ 36 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 వారాల్లో 28 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం 2 వారాల షేర్లు

నైజాం – రూ. 12.31 కోట్లు

సీడెడ్ – రూ. 4.22 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ 4.27 కోట్లు

ఈస్ట్ – రూ. 1.66 కోట్లు

వెస్ట్ – రూ. 1.40 కోట్లు

గుంటూరు – రూ. 1.96 కోట్లు

కృష్ణా – రూ. 1.81 కోట్లు

నెల్లూరు – రూ. 0.83 కోట్లు