మజిలీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,April 08,2019 - 01:23 by Z_CLU

బాక్సాఫీస్ మంచి ఆకలి మీద ఉన్న టైమ్ లో రిలీజైంది మజిలీ. దీనికి తోడు పాజిటివ్ టాక్ ఒకటి. ఇంకేముంది వసూళ్లలో దూసుకుపోతోంది ఈ సినిమా. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, నాగచైతన్య కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 17 కోట్ల 35 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు చైతూ కెరీర్ లో ఫస్ట్ వీకెండ్ లో ఈ స్థాయి వసూళ్లు ఎప్పుడూ రాలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాస్ నుంచి ఈ మూవీకి రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నైజాంలో సరికొత్త రికార్డు సృష్టించాడు చైతూ.

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ (3 రోజులు) షేర్
నైజాం – రూ. 5.35 కోట్లు
సీడెడ్ – రూ. 1.77 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.94 కోట్లు
ఈస్ట్ – రూ. 0.90 కోట్లు
వెస్ట్ – రూ. 0.64 కోట్లు
గుంటూరు – రూ. 1.24 కోట్లు
కృష్ణా – రూ. 1 కోటి
నెల్లూరు – రూ. 0.40 కోట్లు
ఓవర్సీస్ – రూ. 2.25 కోట్లు