మజిలీ బ్రేక్-ఈవెన్.. 5 రోజుల కలెక్షన్ డీటెయిల్స్

Wednesday,April 10,2019 - 03:30 by Z_CLU

నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మజిలీ మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్నటితో 5 రోజులు పూర్తిచేసుకుంది. ఈ 5 రోజుల్లో సినిమా బ్రేక్-ఈవెన్ సాధించింది. అంటే.. ఇవాళ్టి నుంచి ఈ సినిమా లాభాల బాట పట్టిందన్నమాట.

ఈ 5 రోజుల్లో మజిలీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 26 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. నాగచైతన్య-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందించగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

ప్రస్తుతం మజిలీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు నాగచైతన్య. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు వెంకీ మామ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చేవారం నుంచి మజిలీ సినిమాకు సంబంధించి మరోసారి ఫ్రెష్ గా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారు.