50 కోట్ల క్లబ్ లో చేరిన మజిలీ

Monday,April 15,2019 - 03:20 by Z_CLU

మజిలీ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నిన్నటితో 10 రోజులు పూర్తిచేసుకున్న ఈ మూవీ బ్రేక్-ఈవెన్ అవ్వడమే కాకుండా, వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ తో కెరీర్ రికార్డు క్రియేట్ చేసింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మోస్ట్ ఎమోషనల్ మూవీగా పేరు తెచ్చుకుంది. నాగచైతన్య-సమంత పెయిర్ కు మంచి మార్కులు పడ్డంతో పాటు.. విడదలైన ఈ 10 రోజుల్లో వరల్డ్ వైడ్ 33 కోట్ల
రూపాయల షేర్ సాధించింది.

ఏపీ, నైజాం 10 రోజుల షేర్
నైజాం – రూ. 11.08 కోట్లు
సీడెడ్ – రూ. 3.82 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.70 కోట్లు
ఈస్ట్ – రూ. 1.52 కోట్లు
వెస్ట్ – రూ. 1.15 కోట్లు
గుంటూరు – రూ. 1.90 కోట్లు
కృష్ణా – రూ. 1.66 కోట్లు
నెల్లూరు – రూ. 0.76 కోట్లు