సవ్యసాచి సినిమాలో మెజిస్టిక్ హోమ్ సెట్

Sunday,December 03,2017 - 01:01 by Z_CLU

నాగచైతన్య సవ్యసాచి సినిమాకి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. అల్టిమేట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య లెఫ్ట్ హ్యాండ్ తన ఆధీనంలో ఉండదు అనేది ఈ మూవీలో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ అయితే, మాధవన్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయడం సినిమాపై నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ని సెట్ చేసి పెట్టింది.

ఈ సినిమాలో మాధవన్ నెగెటివ్ రోల్ ప్లే చేయనున్నాడా..? లేకపోతే హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే కీ రోల్ ప్లే చేయనున్నాడా అనేది ఇంకా సీక్రెట్ గా మెయిన్ టైన్ చేస్తున్న సినిమా యూనిట్, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్  లో వేసిన మెజిస్టిక్ హోమ్ సెట్ ని రివీల్ చేసి, సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసింది. ఈ సెట్ లో మాధవన్ పై సినిమాలోని  కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సవ్యసాచి టీమ్.

చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అక్కినేని ఫ్యాన్స్ లో ఇప్పటికే అన్ లిమిటెడ్ క్యూరాసిటీ క్రియేట్ అయి ఉంది. నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. కీరవాణి మ్యూజిక్ కంపోజర్.