రామ్ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ అదే

Wednesday,October 18,2017 - 12:59 by Z_CLU

తెలుగులో సినిమాల్లో ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కనిపిస్తుంటాయి. కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది. కానీ కథ హీరో చుట్టూ తిరిగినా దాన్ని జెన్యూన్ గా చెప్పే ప్రయత్నం మాత్రం చాలా తక్కువగా జరుగుతుంది. అలా నిజాయితీగా చేసిన ఓ ప్రయత్నమే ఉన్నది ఒకటే జిందగీ

రామ్ హీరోగా నటించినే ఈ సినిమాలో కథే హీరో. కేవలం కథను నమ్మి చేసిన సినిమా ఇది. అభిరామ్ అనే వ్యక్తి లైఫ్ లో జరిగిన సంఘటనల సమాహారమే ఉన్నది ఒక్కటే జిందగీ. లైఫ్ ను ఎంజాయ్ చేసే అభిరామ్.. స్నేహితులకు విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. అదే టైమ్ లో ప్రేమలో కూడా పడతాడు. ఓ వైపు స్నేహితులు, ప్రేయసి.. మరోవైపు కెరీర్. ఇలాంటి పరిస్థితుల్లో అభిరామ్ జీవితంలో జరిగిన పెను మార్పులతో ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ ఎమోషన్. ఆ ఎమోషన్ ఆధారంగానే సినిమా కథ మొత్తం నడుస్తుంది. ట్రయిలర్ లో కూడా ప్రతి డైలాగ్ లో ఆ ఎమోషన్ కనిపిస్తుంది. ఇలాంటి బలమైన ఎమోషన్స్ తో తెరకెక్కిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా కచ్చితంగా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు రామ్. ఈనెల 27న విడుదల కానున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకుడు.