దూసుకొస్తున్న శివలింగ

Wednesday,April 12,2017 - 01:05 by Z_CLU

హారర్-సస్పెన్స్ కు కామెడీ మిక్స్ చేస్తూ లాారెన్స్ తీసిన సినిమాలంటే టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఈసారి కూడా లాారెన్స్ అదే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఫర్ ఎ ఛేంజ్.. ఈసారి దర్శకుడు మాత్రం లారెన్స్ కాదు. చంద్రముఖి లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన పి.వాసు దర్శకుడు. అలా లారెన్స్-వాసు కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ శివలింగ

ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. మెయిన్ ఎట్రాాక్షన్ లారెన్స్ ఎప్పీయరెన్స్. తన డాన్సింగ్ టాలెంట్ తో అస్సలు డిసప్పాయింట్ చేయని లాారెన్స్.. ఈసారి శివలింగ సినిమాతో తన యాక్టింగ్ టాలెంట్ కూడా చూపించాడు. ఇక హీరోయిన్ రితికా సింగ్ మరో మెయిన్ ఎట్రాక్షన్. గురు సినిమాతో ఈ చిన్నది తెలుగు ఆడియన్స్ ను బాగానే మెప్పించింది. గురులో డీ-గ్లామరైజ్డ్ రోల్ చేసిన రితిక.. శివలింగలో గ్లామరస్ గా కనిపిస్తోంది. అంతేకాదు.. లారెన్స్ తో కలిసి స్టెప్పులు కూడా బాగానే వేసింది.

శివలింగ సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ పి.వాసు. ఈ తరహా సినిమాల్ని తెరకెక్కించడంలో, గ్రాఫిక్స్ ను సమతూకంలో వాడుకోవడంలో పి.వాసు దిట్ట. ఈ ఎట్రాక్షన్స్ కు తమన్ సంగీతం కూడా యాడ్ అవ్వడంతో శివలింగ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. ఈ శుక్రవారం థియేటర్లలోకి దూసుకొస్తున్నాడు శివలింగ.