ప్యాంగ్ యాంగ్ లో జై మాహిష్మతి

Wednesday,September 21,2016 - 07:00 by Z_CLU

బాహుబలి దుమ్ము దులిపింది. నేషనల్ లెవెల్లో హిట్ అవ్వడమే గొప్ప అనుకుంటే… ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా సెట్స్ పై ఉంది. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. మరోవైపు పార్ట్-1 మాత్రం ఇంకా వివిధ దేశాల్లో రౌండ్స్ కొడుతూనే ఉంది. తాజాగా ఉత్తర కొరియా సినీప్రేక్షకుల్ని బాహుబలి ఎట్రాక్ట్ చేసింది. ఎంతలా అంటే.. అక్కడి సినీ అభిమానులు జై మాహిష్మతి అంటూ సరదాగా ఒకర్నొకరు పలకరించుకుంటున్నారు.

bahubali-1

   నార్త్ కొరియాలో జరుగుతున్న 15వ ప్యాంగ్ యాగ్ ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ లో బాహుబలి సినిమా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ఈ సినిమాను చూసేందుకు అక్కడి జనాలు ఎగబడ్డారు.

bahubali-2

కేవలం 3 షోలు వేస్తే, 5వేల మంది వచ్చారంటే బాహుబలి క్రేజ్ అర్థంచేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 6వందల కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇంకా కలెక్షన్లు సృష్టిస్తూనే ఉంది.

bahubali-3