వై.ఎస్.ఆర్ బయోపిక్ తో రెడీ అవ్తున్న సూపర్ హిట్ డైరెక్టర్

Sunday,March 04,2018 - 11:40 by Z_CLU

ఇటివలే ‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మహి వి రాఘవ్.. తన తదుపరి సినిమాగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ బయోపిక్ ను ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో  వై.ఎస్.ఆర్ గా మమ్ముట్టీ నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. లేటెస్ట్ గా దర్శకుడు మహి రాఘవ్ మమ్ముట్టీ ని కలిసి  కథ వినిపించాడని, స్క్రిప్ట్ నచ్చడంతో మమ్ముట్టీ ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

ప్రస్తుతం స్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను 70 ఎం ఎం బ్యానర్ పై విజయ్, శశి నిర్మించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.