యాత్ర సీక్వెల్ కూడా వస్తోంది

Wednesday,May 29,2019 - 05:36 by Z_CLU

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన పాదయాత్ర బ్యాక్ డ్రాప్ తో వచ్చింది యాత్ర సినిమా. మహి వి రాఘవ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు దర్శకుడు.

రాజారెడ్డి, జగన్ ప్రస్థావన లేకుండా వైఎస్ఆర్ స్టోరీ చెప్పలేం. యాత్ర-2తో అది జరుగుతుంది. యాత్ర సినిమాను జగన్ తో ఎందుకు ముగించామంటే.. ఎక్కడైతే మేం ఆపామో అక్కడ్నుంచి యాత్ర-2 మొదలవుతుంది. వైఎస్ఆర్ యాత్ర ఆయన తండ్రి సమాధి నుంచి ప్రారంభమౌతుంది. జగన్ యాత్ర వైఎస్ఆర్ ఘాట్ నుంచి మొదలవుతుంది.

ఇలా సోషల్ మీడియాలో యాత్ర-2 ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు దర్శకుడు. ఓవైపు జగన్ ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్న వేళ, ఇలా యాత్ర-2ను ప్రకటించడంతో ప్రాజెక్టుపై బజ్ పెరిగింది. సీక్వెల్ లో జగన్ పాత్రను ఎవరు పోషిస్తారనేది ఇప్పుడు డిస్కషన్ టాపిక్ గా మారింది.