మరోసారి చెన్నైకు షిఫ్ట్ అయిన స్పైడర్

Monday,May 15,2017 - 11:07 by Z_CLU

లెక్క ప్రకారం.. స్పైడర్ మూవీ ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగాలి. కానీ ఇప్పుడీ మూవీ షూటింగ్ చెన్నైకు షిఫ్ట్ అయింది. హైదరాబాద్ లోని నిమ్స్ లో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ జరగలేదు. దీంతో మిగతా బ్యాలెన్స్ పూర్తిచేయడానికి చెన్నైకు వెళ్లారు.

రేపట్నుంచి చెన్నైలో మహేష్ నటిస్తున్న స్పైడర్ సినిమా ఫైనల్ షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. 2 పాటలు మినహా షూటింగ్ మొత్తాన్ని ఈ షెడ్యూల్ లో కంప్లీట్ చేయబోతున్నారు. ఈ రెండు పాటల షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నారు.

మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో స్పైడర్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.