సౌత్ ఇండియాలో మహేష్ నంబర్ వన్

Saturday,June 03,2017 - 11:00 by Z_CLU

సోషల్ మీడియా వ్యూస్ పరంగా మొత్తం దక్షిణాదిలోనే నంబర్ వన్ హీరోగా నిలిచాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ నటించిన స్పైడర్ సినిమా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో తన సత్తా చూపిస్తోంది. ఈ టీజర్ కు కేవలం 24 గంటల్లోనే 6.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక సినిమా టీజర్ కు కేవలం ఒక రోజుల్లో 60లక్షల 30వేల వ్యూస్ రావడం ఓ రికార్డు.

మురుగదాస్ ఆలోచనకు, మహేష్ స్టార్ డమ్ తోడవ్వడంతో స్పైడర్ టీజర్ సౌత్ లోనే నంబర్ వన్ గా నిలిచింది. దీనికి తోడు బాలీవుడ్ నుంచి దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో వ్యూస్ గంటగంటకు వేలల్లో పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి సౌతిండియాలో కేవలం 24 గంటల్లోనే ఎక్కువమంది చూసిన టీజర్ గా స్పైడర్ రికార్డు సృష్టించింది.

స్పైడర్ తర్వాత స్థానంలో అజిత్ నటించిన వివేగమ్ సినిమా ఉంది. ఈ సినిమా టీజర్ ను 24 గంటల్లో 60లక్షల 9వేల మంది చూశారు. మూడో స్థానంలో రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఉంది. ఇక టాప్-10లో పవన్ నటించిన కాటమరాయుడు, చిరంజీవి ఖైదీ నంబర్ 150, ప్రభాస్ సాహో, అల్లు అర్జున్ డీజే టీజర్లు ఉన్నాయి.