క్లైమాక్స్ కొచ్చిన మహేష్ మూవీ

Monday,October 21,2019 - 06:24 by Z_CLU

పెర్ ఫెక్ట్ గా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేసి, పక్కా ప్లానింగ్ తో సెట్స్ పైకి వచ్చిన అనీల్ రావిపూడి.. చూస్తుండగానే సరిలేరు నీకెవ్వరు సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చాడు. మహేష్ లాంటి బిగ్ స్టార్ ను పెట్టుకొని కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమాను క్లైమాక్స్ కు తీసుకొచ్చాడు. అవును.. సరిలేరు నీకెవ్వరు సినిమా ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటరైంది.

టాకీ పార్ట్ కు సంబంధించి కేవలం లాస్ట్ షెడ్యూల్ ఒక్కటే పెండింగ్ లో ఉందని స్వయంగా అనీల్ రావిపూడి ప్రకటించాడు. తాజాగా ఈ దర్శకుడు, సినిమాకు సంబంధించి విలన్ పోర్షన్ మొత్తం కంప్లీట్ చేశాడు. లాస్ట్ షెడ్యూల్ లో మహేష్ పై కొన్ని సన్నివేశాలు, విజయశాంతిపై మరికొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు.

టాకీ పూర్తయితే కేవలం సాంగ్స్ మాత్రమే పెండింగ్ లో ఉంటాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికి సినిమాకు సంబంధించి టోటల్ షూట్ పూర్తిచేయాలనేది డైరక్టర్ టార్గెట్. అక్కడ్నుంచి ప్రమోషన్, పోస్ట్ ప్రొడక్షన్ ను సైమల్టేనియస్ గా చేస్తూ జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్నారు.

అనీల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.