భరత్ అనే నేను ట్రయిలర్ రివ్యూ

Sunday,April 08,2018 - 09:05 by Z_CLU

మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భరత్ అనే నేను. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు భరత్ బహిరంగ సభ అనే పేరుపెట్టారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా సినిమా ట్రయిలర్ విడుదల చేశారు.

ది జర్నీ ఆఫ్ భరత్ పేరిట విడుదలైన ట్రయిలర్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. కంప్లీట్ పొలిటికల్ ఎస్సెన్స్ తో వచ్చిన ఈ ట్రయిలర్ లో మరోసారి తన విశ్వరూపం చూపించాడు మహేష్. లుక్, స్టయిల్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విభాగాల్లో మహేష్ హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పుట్ ఇచ్చాడు.

వ్యవస్థను మార్చాలనుకునే భరత్ ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, సీఎం అయిన తర్వాత ఏం చేశాడనే అంశాలతో భరత్ అనే నేను సినిమా తెరకెక్కింది. మరీ ముఖ్యంగా ఇందులో హై-ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉందనే విషయం కూడా ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

మహేష్ యాక్టింగ్, కొరటాల టేకింగ్ తో పాటు దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రవి కె.చంద్రన్, తిరు సినిమాటోగ్రఫీ, రామ్ లక్ష్మణ్ ఫైట్స్, అసెంబ్లీ సెట్ ట్రయిలర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.