భరత్ అనే నేను షూటింగ్ అప్ డేట్స్

Saturday,February 03,2018 - 02:02 by Z_CLU

కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. నిన్నటితో ఈ మూవీకి సంబంధించి క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. మరో 6 రోజుల పాటు షూటింగ్ కొనసాగుతుంది.

సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా టైటిల్ కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాతో కైరా అద్వానీ టాలీవుడ్ కు పరిచయమౌతోంది.

శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్-కొరటాల కాంబోలో వస్తున్న సినిమా ఇది. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది. డీవీవీ ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.