లండన్ వెళ్లబోతున్న 'భరత్'

Thursday,February 22,2018 - 02:34 by Z_CLU

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భరత్ అనే నేను. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేశారు. మార్చి ఫస్ట్ వీక్ లో ఇది స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి టాకీ పూర్తవుతుంది.

కథ ప్రకారం సినిమాలో ఎన్నారై కుర్రాడిగా కనిపించబోతున్నాడు మహేష్. అందుకే ఆ సన్నివేశాల చిత్రీకరణ కోసం లండన్ వెళ్లనుంది యూనిట్. ఈ సినిమాతో కైరా అద్వానీ హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఏప్రిల్ 26న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

భరత్ అనే నేను సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.