సోషల్ మీడియాలో భరత్ హంగామా

Wednesday,March 07,2018 - 11:38 by Z_CLU

మహేష్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ భరత్ అనే నేను. ఈ సినిమా టీజర్ నిన్న రిలీజైంది. విడుదలైన ప్రతి సెకెండ్ ఈ టీజర్ కు వ్యూస్ వస్తూనే ఉన్నాయి. విజన్ ఆఫ్ భరత్ పేరిట విడుదలైన ఈ టీజర్ కు జస్ట్ 12 గంటల్లో 60లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలా సోషల్ మీడియాలో మహేష్ స్టామినాను చాటిచెప్పింది భరత్ అనే నేను టీజర్

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టేజ్ నుంచే ట్రెండ్స్ క్రియేట్ చేస్తోంది. దీనికి కారణం శ్రీమంతుడు మూవీ. గతంలో కొరటాల-మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. భరత్ అనే నేను ప్రాజెక్టుపై బజ్ పెరిగింది. ఆ అంచనాలకు తగ్గట్టే టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాతో కైరా అద్వానీ టాలీవుడ్ కు పరిచయమౌతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ తో పాటు.. ఆడియో రిలీజ్ డీటెయిల్స్ వెల్లడిస్తారు.