కొత్త లుక్ తో మహేష్ హంగామా

Wednesday,June 06,2018 - 01:29 by Z_CLU

‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు నెక్స్ట్ వంశీ పైడి పల్లి తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… మహేష్ 25 వ సినిమా కావడంతో మేకర్స్ కూడా ఈ సినిమాపై కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు..  ఈ సినిమా కోసం మహేష్ గెడ్డం పెంచాబోతున్నాడనే వార్తలు నిన్నటి వరకూ వినిపించాయి. అయితే ఇప్పుడీ వార్తపై పై క్లారిటీ వచ్చేసింది.  గెడ్డం..మీసం పెంచి కొత్త లుక్ తో ముంబై ఎయిర్ పోర్ట్ లో కెమెరాకి చిక్కాడు సూపర్ స్టార్.

 

 గెడ్డంతో ఉన్న మహేష్ న్యూ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అశ్విని దత్, దిల్ రాజు  సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా ప్రెజెంట్  ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురబోతున్నాడు మహేష్. మరి ఈ సినిమాలో  మహేష్ ను వంశీ పైడిపల్లి ఎలా ప్రెజెంట్ చేస్తాడో… చూడాలి.