మహేష్ సెంటిమెంట్ .. సుకుమార్ రీచ్ అవుతాడా?

Wednesday,February 13,2019 - 10:03 by Z_CLU

భరత్ అనే నేను ఏప్రిల్ లో రిలీజైంది.. సూపర్ హిట్ అయింది

మహర్షి సినిమా కూడా ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది

మరి సుకుమార్ సినిమా పరిస్థితేంటి ?

భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మరోసారి అదే నెలలో థియేటర్లలోకి రాబోతున్నాడు మహేష్. తన ప్రతిష్టాత్మక మహర్షి సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ కు రెడీ చేశాడు. మహేష్ ఇలాంటివి పట్టించుకోకపోయినా ఫ్యాన్స్ మాత్రం దీన్ని సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు.

సో.. మహర్షి తర్వాత మహేష్ చేయబోయే సుకుమార్ సినిమా కూడా ఏప్రిల్ లోనే థియేటర్లలోకి రావాలనేది అభిమానుల కోరిక. మరి ఈ కోరికను సుకుమార్ నెరవేరుస్తాడా? మహేష్ మూవీని 2020 ఏప్రిల్ నాటికి రెడీ చేయగలడా?

నిజానికి సుకుమార్ కు చాలా టైమ్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఏడాదికి పైగా అతడికి టైమ్ దొరికింది. కాబట్టి మహేష్ తో మూవీని 2020 ఏప్రిల్ కు రెడీ చేయడం ఏమంత కష్టమైన పని కాదు. సో.. మహేష్-సుకుమార్ మూవీ కూడా ఫ్యాన్స్ కోరిక మేరకు ఏప్రిల్ లోనే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.