హీరోయిన్స్ కోసం...

Tuesday,October 18,2016 - 04:07 by Z_CLU

మురుగదాస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు మరోవైపు “శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన కొరటాల శివతో అప్పుడే  గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశాడు. ఏదో ఒక సోషల్ మెసేజ్ ని ఇస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో భారీ సినిమాలను తెరకెక్కించే కొరటాల శివ… ఈసారి కూడా ఒక సందేశాన్ని, దానికితోడుగా ఇంకాస్త ఎంటర్ టైన్ మెంట్ ను అందించబోతున్నాడు. ఇందులో భాగంగా మహేష్ కోసం తన కథలో ఇద్దరు ముద్దుగుమ్మలను సెట్ చేశాడు కొరటాల.

mahesh-babu-film1

అవును… మహేష్-కొరటాల సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. ఆ అదృష్టవంతులు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకరి కంటే ఎక్కువ మంది హీరోయిన్లతో తెరపై మెరిసిన అనుభవం మహేష్ కు ఉంది. బ్రహ్మోత్సవంలో అయితే ఏకంగా ముగ్గురు భామలతో సరసాలాడాడు.  మరి కొరటాల కొత్త సినిమాలో మహేష్ తో ఆడిపాడబోయే ఆ ఇద్దరు ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది.