దేవిశ్రీకి స్పైడర్ విషెష్

Sunday,May 07,2017 - 03:30 by Z_CLU

మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ కు హీరో మహేష్ బాబు స్పెషల్ విషెష్ చెప్పారు. ఈనెల 27 నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రత్యేక సంగీత ప్రదర్శనలు ఇవ్వబోతున్నాడు దేవిశ్రీ. ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందించాడు మహేష్.

“శ్రీమంతుడు ఆడియో లాంచ్ లో దేవిశ్రీ లైవ్ పర్ఫార్మెన్స్ చూశాను. అతడి ఎనర్జీ సూపర్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఉన్న తెలుగు, తమిళ ప్రజలు కచ్చితంగా దేవిశ్రీ లైవ్ షోను ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది.” అని స్పందించాడు మహేష్.

మహేష్ నటించిన వన్-నేనొక్కడినే సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. కొరటాల దర్శకత్వంలో మహేష్ చేసిన శ్రీమంతుడు సినిమాకు కూడా దేవిశ్రీనే సంగీతం ఇచ్చాడు. త్వరలోనే కొరటాల-మహేష్ కాంబోలో రాబోతున్న “భరత్ అను నేను”  ప్రాజెక్టుకు కూడా డీఎస్పీ సంగీతం అందిస్తున్నాడు.