రొమేనియా బయల్దేరిన మహేష్

Friday,August 25,2017 - 01:02 by Z_CLU

స్పైడర్ సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్ మొదలైంది. తన సినిమా యూనిట్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు, రొమేనియా బయల్దేరాడు. “రొమేనియా వెళ్తున్నాను. స్పైడర్ లాస్ట్ సాంగ్ షూటింగ్ కోసం.” అంటూ ట్వీట్ చేశాడు మహేశ్.

నిజానికి స్పైడర్ రొమేనియా షెడ్యూల్ 2 రోజులు ఆలస్యంగా మొదలైంది. 2 రోజుల కిందటే రొమేనియా వెళ్లాల్సిన యూనిట్.. ఈరోజు బయల్దేరింది. రొమేనియాలో హీరో మహేష్, హీరోయిన్ రకుల్ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేయబోతున్నారు. ఈ సాంగ్ తో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రెండు భాషలతో పాటు అదే రోజు వీలైతే మలయాళం, అరబిక్ భాషల్లో కూడా స్పైడర్ ను రిలీజ్ చేయాలనేది ప్లాన్.