మహేష్ బాబు మరో హాలిడే ట్రిప్

Thursday,October 03,2019 - 07:03 by Z_CLU

గ్యాప్ దొరికితే ఏమాత్రం ఆలస్యం చేయడు మహేష్. ఈసారి కూడా అదే చేశాడు. కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ స్టార్ట్ చేశాడు. కొన్నాళ్లుగా బిజీబిజీగా సెట్స్ లోనే గడిపాడు మహేష్. మరోవైపు పిల్లలు సితార, గౌతమ్ కూడా స్కూల్స్ తో బిజీ. అలా లాంగ్ గ్యాప్ తర్వాత దసరా శెలవులు రావడంతో మహేష్ కూడా షూటింగ్ కు లీవ్ పెట్టేశాడు.

ఈ దసరాను దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు మహేష్ బాబు. ఈ స్టార్ ఫ్యామిలీ ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అయిపోయింది కూడా. ఈ మేరకు నమ్రమ ఓ పోస్ట్ పెట్టారు. తమ కుటుంబానికి దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయంటూ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు మహేష్. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే దాదాపు 50శాతం షూటింగ్ పూర్తిచేసిన మహేష్, ఇప్పుడిలా చిన్న గ్యాప్ తీసుకున్నాడు. దసరా తర్వాత మళ్లీ ఏకథాటిగా షూటింగ్ చేసి బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేస్తాడు.