జీ స్పెషల్: సూపర్ స్టార్ కు దారేది?

Saturday,March 21,2020 - 12:37 by Z_CLU

సరిలేరు నీకెవ్వరు థియేటర్లలోకొచ్చి చాన్నాళ్లయింది. ఆ సినిమా ఫైనల్ రన్ కూడా ముగిసింది. అయినప్పటికీ ఇప్పటివరకు మహేష్ తన నెక్ట్స్ సినిమా ఏంటనేది క్లారిటీ ఇవ్వలేదు. సూపర్ స్టార్ లిస్ట్ లో చాలామంది దర్శకులున్నప్పటికీ ప్రస్తుతానికి ఇద్దర్ని మాత్రమే ఫైనల్ చేశాడు.

వాళ్లే వెంకీ కుడుముల, పరశురాం. వీళ్లలో ముందుగా పరశురాం కథ విన్నాడు మహేష్. దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతలోనే వెంకీ కుడుముల కూడా ఓ మంచి స్టోరీలైన్ వినిపించాడు. అది కూడా మహేష్ కు నచ్చి డెవలప్ చేయమని చెప్పాడు.

ప్రస్తుతానికైతే ఈ రెండు స్క్రిప్ట్స్ లో ఒకటి ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు మహేష్. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏది లాక్ అయినా, జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు మహేష్.