సాయిధరమ్ తేజ సినిమాకు మహేష్ ప్రమోషన్

Wednesday,February 01,2017 - 10:47 by Z_CLU

మొన్నటికి మొన్న తన కొత్త సినిమా ఓపెనింగ్ కోసం యంగ్ టైగర్ ను ఆహ్వానించాడు సాయిధరమ్ తేజ. ఇప్పుడు రిలీజ్ రెడీ అయిన విన్నర్ కోసం మహేష్ బాబును రంగంలోకి దించుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు మొదటి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. సితార అనే లిరిక్స్ తో సాగేే ఈ పాటను స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయబోతున్నాడు. సరిగ్గా ఈ రోజు సాయంత్రం 7 గంంటలకు… తన ట్విట్టర్ పేజ్ ద్వారా విన్నర్ ఫస్ట్ సాంగ్ ను మహేష్ బాబు రిలీజ్ చేస్తాడు.

winner

గోపీచంద్ మలినేని డైరక్ట్ చేసిన విన్నర్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను ఠాగూర్ మధు, నల్లమలపు శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. టీజర్ కు ఇప్పటికే మంచి హైప్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 24న విన్నర్ సినిమా థియేటర్లలోకి రానుంది.