కార్తితో మహేష్ సినిమా?

Thursday,June 04,2020 - 12:57 by Z_CLU

త్వరలోనే పరశురాంతో ‘సర్కారు వారి పాట’ సినిమా చేయబోతున్న మహేష్ బాబు మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలపై ఫోకస్ పెట్టబోతున్నాడు. ప్రస్తుతం తను హీరోగా నటించే ప్రతీ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న మహేష్.. తన సొంత బ్యానర్ పై అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఆ సినిమాను ఇతర నిర్మాణసంస్థలతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న మహేష్… త్వరలోనే సోలో ప్రొడ్యుసర్ గా మారి సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయ్యాడని టాక్.

త్వరలోనే విజయ్ దేవరకొండ హీరోగా ‘GMB’బ్యానర్ పై మహేష్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అలాగే కార్తితో కూడా ఓ సినిమా అనుకుంటున్నారట. తెలుగులో ‘ఊపిరి’ సినిమా చేశాడు కార్తి. అలాగే కార్తి ప్రతి సినిమా ఇక్కడ డబ్బింగ్ అవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఓ కొత్త దర్శకుడితో కార్తి హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారట మహేష్. ఈ ఇద్దరే కాకుండా యంగ్ హీరోలతో కాన్సెప్ట్ బేస్డ్ సి సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడట సూపర్ స్టార్.