మహేష్ బాబు వెబ్ సిరీస్

Friday,February 01,2019 - 12:32 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సినిమాలతో బిజీగా ఉంటూనే బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే AMB సినిమాస్ పేరిట హైదరాబాద్ లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మరో బిజినెస్ లోకి కూడా ఎంటర్ కాబోతున్నాడు. అదే వెబ్ సిరీస్.

అవును.. త్వరలోనే వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నాడు మహేష్. MB ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్న ఈ వెబ్ సిరీస్ పేరు చార్లీ. “నాన్నకు ప్రేమతో” సినిమాకి కథ అందించిన హుస్సేన్ షా కిరణ్ ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.

మొత్తం 3 సీజన్స్ గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనుంది. ఒక్కో సీజన్ కు 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి దాదాపు గంట ఉంటుందట. మహేష్ భార్య నమ్రత ఈ వెబ్ సిరీస్ నిర్మాణ వ్యవహారాల్ని చూసుకుంటుందట. త్వరలోనే దీనిపై ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.