Mahesh Babu - నెల రోజులు అక్కడే!
Saturday,October 31,2020 - 01:50 by Z_CLU
లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కి దూరంగా ఉన్న SuperStar Mahesh Babu ఎట్టకేలకు తన నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. Parasuram దర్శకత్వం లో మహేష్ హీరోగా నటించనున్న ‘SarkaruVari Paata’ మొదటి షెడ్యుల్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.
అమెరికాలో లాంగ్ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు యూనిట్. ఇప్పటికే లొకేషన్స్ తో పాటు సన్నివేశాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేశారు. ఈ షెడ్యుల్ లో మహేష్ తో పాటు Keerthy Suresh కూడా పాల్గొననుంది. ముందుగా మహేష్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీసి తర్వాత కాంబో సీన్స్ షూట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

Mythri Movie Makers , 14Reels Plus సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు Thaman మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.