దూకుడు కాంబినేషన్ రిపీట్ అవుతుందా...?

Monday,November 28,2016 - 09:34 by Z_CLU

ఓ దర్శకుడు నచ్చితే… హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా అతడికి వరుసగా అవకాశాలివ్వడం మహేష్ బాబుకు కొత్తేం కాదు. గతంలో గుణశేఖర్ విషయంలో కూడా అదే చేశాడు. గుణతో వరుసగా 3 సినిమాలు చేశాడు. ఇప్పుడు ఇదే పద్ధతిని శ్రీనువైట్ల విషయంలో కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నాడట మహేష్ బాబు. కుదిరితే వైట్లకు మరో ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకుంటున్నాడట.
dookudu
మహేష్-వైట్ల కాంబినేషన్ లో దూకుడు సినిమా వచ్చింది. అది ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి ఆగడు సినిమా చేశారు. కాకపోతే అది మహేష్ కెరీర్ కు అస్సలు కలిసిరాలేదు. ఆ తర్వాత మళ్లీ శ్రీనువైట్లతో సినిమా చేయలేదు మహేష్. తాజాగా మహేష్ బాబుకు ఓ స్టోరీలైన్ వినిపించాడట శ్రీనువైట్ల. ఆ కథ మహేష్ కు బాగా నచ్చినట్టు టాక్.
aagadu
ప్రస్తుతం మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. త్వరలోనే కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఆ తర్వాత పీవీపీ బ్యానర్ లో వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఇంకో మూవీ ఉంటుంది. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో శ్రీనువైట్లకు ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.