స్పీడ్ పెంచిన సూపర్ స్టార్

Saturday,December 03,2016 - 02:30 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ ఇకపై జెట్ స్పీడ్ తో దూసుకెళ్లాలని డిసైడ్ అయిపోయాడు. అందుకే వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ షూటింగ్ లో దూకుడు చూపిస్తున్నాడు. ప్రెజెంట్ మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ ఈ షూటింగ్ లో  తన స్పీడ్ చూపిస్తూ ఫాస్ట్ గా సీన్స్ పూర్తిచేస్తున్నాడట. డే అండ్ నైట్ ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని సమాచారం.

ఒక సినిమా సెట్స్ పై ఉండగా మరో సినిమా గురించి ఆలోచించని మహేష్ ఇకపై సెట్స్ పై ఓ సినిమా ఉండగానే మరో సినిమా కోసం ప్లానింగ్ రెడీ చేస్తున్నాడట. మురుగదాస్ సినిమా తర్వాత కొరటాలతో సినిమా చేయబోతున్న మహేష్… ఆ మూవీని జనవరి నుండి సెట్స్ పై పెట్టబోతున్నాడు. అందుకే ప్రస్తుతం తను నటిస్తున్న సినిమా షూటింగ్ ను స్పీడప్ చేశాడట. మరి మహేష్ ఈ స్పీడ్ ను ఎప్పటివరకూ కంటిన్యూ చేస్తాడో చూడాలి.